R.NarayanaMurty - నేను చాలా ధనవంతుడ్ని

Friday,July 16,2021 - 10:49 by Z_CLU

– నారాయణమూర్తి కష్టాల్లో ఉన్నాడు. ఇంటి అద్దె కూడా కట్టుకోలేక సిటీకి దూరంగా ఉన్నాడంటూ కొందరు రాశారు. అది తప్పు. నాకు పల్లె వాతావరణం ఇష్టం. అందుకే దూరంగా ఉంటున్నాను. కొంతమంది నేను గతిలేక అమీర్ పేట హాస్టల్ లో ఉంటున్నానని రాశారు. అది చాలా తప్పు.

– నా ఊరి నుంచి హైదరాబాద్ కు ఆటోలో వస్తే వెయ్యి రూపాయలు అవుతుంది. నెలకు 30వేల ఖర్చు. ఆ డబ్బుతో నేను సిటీలోనే అద్దెకు ఉండొచ్చు. కానీ నాకు ఇష్టం లేదు. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను.

– నా దగ్గర డబ్బుల్లేవన్నారు. అది అబద్ధం. నేను కోట్లు సంపాదించాను. నాకు తినడానికి కావాల్సినంత ఉంచుకొని.. తెలుగు రాష్ట్రాల్లో విద్య-వైద్యానికి మొత్తం ఖర్చుపెట్టాను. నాకు దిండు-చాప ఉంటే చాలు. డబ్బు అక్కర్లేదు. నాకు సొంతిల్లు లేదు. ఎవరైనా ఇస్తానన్నా వద్దంటాను.

– దాసరి నారాయణరావు, కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ నాకు డబ్బులిస్తామన్నారు, ఇళ్లు ఇస్తామన్నారు, భూములిస్తామన్నారు. ఒక్క పైసా తీసుకోలేదు, ఒక్క గజం తీసుకోలేదు. నాకొద్దు.

– నేను చాలా ధనవంతుడ్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు హెల్ప్ చేసే స్నేహితులున్నారు. ఏది అడిగితే అది హెల్ప్ చేసే పరిశ్రమ పెద్దలున్నారు. కోట్లాది మంది నన్ను ప్రేమించేవాళ్లున్నారు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. నాకు ఏ కష్టాల్లేవ్. నేను రిచ్ ఫెలోని.

– నేను కష్టాల్లో ఉన్నానేమో అనుకొని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, డబ్బులు పంపిస్తామంటున్నారు. వాళ్ల మాటలకు నాకు ఏడుపొస్తోంది. వాళ్ల అభిమానానికి సెల్యూట్ చేస్తున్నా. నా దగ్గర డబ్బులున్నాయి, ఎవ్వరూ నాకు డబ్బు పంపించొద్దు.

– యూట్యూబ్ మిత్రులారా మీకు దండం పెడతా, నా గురించి తప్పుగా రాయొద్దు. నేను హ్యాపీగా బతుకుతున్నాను, నా స్టయిల్ లో నేను దర్జాగా బతుకుతున్నాను.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics