Dhanush Sekhar Kammula Movie - షూటింగ్ డీటెయిల్స్ !

Thursday,July 15,2021 - 03:48 by Z_CLU

Dhanush, Sekhar Kammula Movie Shooting Details

త్వరలోనే లవ్ స్టోరి సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్న శేఖర్ కమ్ముల నెక్స్ట్ ధనుష్ తో తెలుగు, తమిళ్ లో ఓ భారీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇటివలే ధనుష్ హైదరాబాద్ రావడం దర్శక నిర్మాతలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ధనుష్ కి ఫైనల్ నరేషన్ కూడా ఇచ్చేసి లోకేషన్స్ వేటలో పడ్డాడు శేఖర్ కమ్ముల. మరో వైపు సినిమాలో హీరోయిన్ , మిగతా కాస్టింగ్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

ఎనౌన్స్ మెంట్ నుండే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సర్ప్రయిజింగ్ కాంబో ఎలాంటి సినిమాతో వస్తుందా? అనే ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇది ధనుష్ స్టైల్ లో మాస్ యాక్షన్ సినిమా? లేదా శేఖర్ కమ్ముల మార్క్ క్లాస్ సినిమానా? అనేది తెలియాల్సి ఉంది. ధనుష్ తో శేఖర్ తన మార్క్ సాఫ్ట్ సినిమా తీసే అవకాశముందని వినిపిస్తుంది. అలాగే హీరోకి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఉంటుందని అందుకే ఏరి కోరి మరీ శేఖర్ కమ్ముల ధనుష్ ని ఎంచుకున్నాడని అంటున్నారు.

Sekhar Kammula Dhanush Movie

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పెద్దగా డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు శేఖర్ కమ్ముల. ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ గురించి ఒక్కో విషయాన్ని ఒక్కో సందర్భంలో ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. డిసెంబర్ లో జరగనున్న మొదటి షెడ్యుల్ మాత్రం హైదరాబాద్ లోనే ఉండనుందని సమాచారం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics