NBK 107 బాలయ్య సినిమాకు టైటిల్ అదేనా ?

Wednesday,February 23,2022 - 12:00 by Z_CLU

Power full Title fixed for Balakrishna’s NBK107 ?

రెండ్రోజులుగా బాలయ్య లుక్ తో హాట్ టాపిక్ అవుతోంది #NBK107 సినిమా. పంచెకట్టులో మాస్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశాడు బాలయ్య. ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు మేకర్స్. ప్రస్తుతానికి బాలయ్య సినిమా కౌంట్ తోనే ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు కొన్ని టైటిల్స్ అనుకుంటున్నారని, టీం పరీశీలిస్తున్న టైటిల్స్ బయటికొచ్చాయి.

అందులో ‘జై బాలయ్య’ , ‘పెద్దాయన’ అనే టైటిల్స్ వినిపిస్తుండగా తాజాగా మరో పవర్ ఫుల్ టైటిల్ లిస్టులో చేరింది. ఆ టైటిలే ‘వీర సింహా రెడ్డి’. బాలయ్యకి సింహా అనే టైటిల్ సెంటిమెంట్ అన్న సంగతి తెలిసిందే. లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడైన బాలయ్య ఈ టైటిల్ నే ఫిక్స్ చేయమని మేకర్స్ తో చెప్పారని సమాచారం.

ప్రస్తుతం సిరిసిల్లలో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండో షెడ్యుల్ హైదరాబాద్ లో జరగనుంది. ‘అఖండ’ తర్వాత బాలయ్య , ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ మలినేని నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రేడ్ పరంగా కూడా సినిమాకు మంచి క్రేజ్ ఉంది. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దునియా విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics