శర్వానంద్ కొత్త సినిమా - పడి పడి లేచె మనసు

Tuesday,March 06,2018 - 11:47 by Z_CLU

హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ మధ్యే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. మూవీకి “పడి పడి లేచె మనసు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పక్కింటి కుర్రాడిలా నేచురల్ లుక్ లో శర్వానంద్ ను చూపించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ చుక్కలపల్లి, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్ కతా, ముంబయి నగరాల్లో జరుగుతోంది. త్వరలోనే నేపాల్ లో మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.