మరో మెస్మరైజింగ్ పాత్రలో సాయిపల్లవి

Wednesday,May 09,2018 - 11:30 by Z_CLU

కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే చాలవు. తన పాత్రకు మంచి స్కోప్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్స్ కే ఓకే చెబుతుంది హీరోయిన్ సాయిపల్లవి. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న పడిపడి లేచే మనసు సినిమాలో కూడా సాయిపల్లవిది అలాంటి కీలక పాత్రే.

ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా పడిపడే లేచే మనసు సినిమా నుంచి సాయిపల్లవి లుక్ ను విడుదల చేశారు. బెంగాలీ అమ్మాయిగా సాయిపల్లవి ఈ సినిమాలో కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఫిదాతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ, ఎంసీఏ, కణం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పడిపడి లేచే మనసు సినిమాలో కూడా హీరోయిన్ గా ఓ మంచి పాత్రతో అలరించబోతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.