సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్

Monday,October 30,2017 - 02:03 by Z_CLU

విలక్షణ నటుడు సూర్య మరో కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. ఫస్ట్ టైం సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. కోలీవుడ్ లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా చూడాలని చాలామంది ఆడియన్స్ వెయిటింగ్. ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్ అయింది. సెల్వ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు సూర్య అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై జనవరి నుంచి సెట్స్ పైకి రానుంది ఈ సినిమా. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు.

సెల్వరాఘవన్ సినిమాలన్నీ విలక్షణంగా ఉంటాయి. ఎమోషన్, లవ్, డ్రామా ఏదైనా పీక్ స్టేజ్ లో చూపించడం సెల్వరాఘవన్ స్టయిల్. 7/జీ బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు సినిమాలు చూస్తే సెల్వరాఘవన్ స్టయిల్ అర్థమౌతుంది. సూర్యతో చేయబోయే సినిమా కూడా తనదైన స్టయిల్ లో సరికొత్తగా ఉంటుందని ప్రకటించాడు ఈ దర్శకుడు.

ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. టెక్నీషియన్స్ తో పాటు హీరోయిన్ ఎవరనే విషయంపై త్వరలోనే ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.