Seetimaarr - మళ్లీ సెట్స్ పైకి గోపీచంద్

Tuesday,November 17,2020 - 11:58 by Z_CLU

ఎగ్రెసివ్ స్టార్ Gopichand, మాస్ డైరెక్ట‌ర్ Sampath Nandi కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ సీటీమార్‌. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

gopichand sampath nandi seetimaarr 2

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కి ముందే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‌లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ షూటింగ్‌ న‌వంబ‌ర్ 23 నుండి ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో సినిమా ని కంప్లీట్ చేయ‌బోతున్నారు.

gopichand tamanna seetimaarr 3

లాక్‌డౌన్‌కి ముందే రాజమండ్రి, హైదరాబాద్ ఆర్ఎఫ్‌సిలో‌ షూటింగ్ జ‌రిపి 3 భారీ షెడ్యూల్స్‌లో 60 శాతం సినిమా పూర్తిచేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామా సీటీమార్. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Gopichand Seetimaarr movie 1

ఈ సినిమాలో ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్‌లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

Also Check – సీటీమార్ స్టిల్స్