శ్రీకాంత్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్

Saturday,July 15,2017 - 01:33 by Z_CLU

శ్రీకాంత్ హీరో గా, నాజియా నాయికగా నటిస్తున్న చిత్రం రా..రా. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలలోనే విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ గీతాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ తో పాటు చిత్ర సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, గాయని మౌష్మీ నేహా నిర్మాత విజయ్ తదితరులు పాల్గొన్నారు. ‘గల్లాటే గల్లాటే’ పల్లవి గల ఈ గీతాన్ని భాషాశ్రీ రచించగా గాయని మౌష్మీ నేహా ఆలపించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’ ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రం. ఈ గీతానికి శ్రోతలనుంచి మంచి స్పందన లభించటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమా గురించి శ్రోతలతో మాట్లాడటం ఆనందం కలిగించిందన్నారు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.