మరో సినిమా ఎనౌన్స్ చేసిన నాని

Saturday,July 15,2017 - 01:20 by Z_CLU

చెప్పినట్టుగానే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరో సినిమా ప్రకటించాడు నేచురల్ స్టార్ నాని. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన నాని, ఆ మూవీ డీటెయిల్స్ ను ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి సమర్పణలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు. ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు.

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇందులో నాని డ్యూయర్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇంతకుముందు జెంటిల్ మన్ సినిమాలో డిఫరెంట్ డ్యూయల్ రోల్ లో మెప్పించిన నేచురల్ స్టార్.. కృష్ణార్జున యుద్ధంలో కూడా రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. టైటిల్ కు తగ్గట్టు ఒక క్యారెక్టర్ పేరు కృష్ణ, మరో పాత్ర పేరు అర్జున్ అంటూ ఇప్పటికే గాసిప్స్ మొదలయ్యాయి.

ధృవ సినిమాకు డిఫరెంట్ ట్యూన్స్ అందించిన హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే నెల నుంచి సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.