గీతగోవిందం నుంచి సెకెండ్ సింగిల్

Wednesday,July 25,2018 - 11:38 by Z_CLU

“ఇంకేం..ఇంకేం..ఇంకేంకావాలి..” గీతగోవిందం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సోషల్ మీడియాలో 10 మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు సెకెండ్ సింగిల్ రాబోతోంది.

“వాట్ ది ఎఫ్” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రేపు ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ను స్వయంగా హీరో విజయ్ దేవరకొండ పాడాడు. ఈ సినిమాతో దేవరకొండ సింగర్ గా కూడా మారిన విషయాన్ని జీ సినిమాలు.కామ్ ఎక్స్ క్లూజివ్ గా బయటపెట్టిన విషయం తెలిసిందే.

గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటల్ని ఈ ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఆదివారం ఉదయం నుంచి జ్యూక్ బాక్స్ అందుబాటులోకి వస్తుంది. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది గీతగోవిందం సినిమా.