రెండో ఫిలింసిటీ ఆయనే...

Thursday,December 08,2016 - 04:12 by Z_CLU

టాలీవుడ్ లో అభిరుచి గల నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు… బడా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ప్రొడ్యూసర్ గా కూడా మరింత స్పీడ్ పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో సినిమాను ప్లాన్ చేసే దిల్ రాజు… ఈ ఏడాది మాత్రం ఏకంగా 5 సినిమాలు స్టార్ట్ చేశాడు. ఇందులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథం’,’నేను
లోకల్’,’ఫిదా’,’శతమానం భవతి’ సినిమాలతో పాటు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘డ్యూయెట్’ సినిమాకు తెలుగు లో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు దిల్ రాజు. దీనిపై నేచురల్ స్టార్ నాని తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యాడు.

nani-dilraju

దిల్ రాజు సమర్పిస్తున్న ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు గెస్ట్ గా హాజరైన నాని…. దిల్ రాజు గురించి మాట్లాడుతూ “నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నానని అంటున్నారు.. మరి ఆయన్నేమనాలి ?. ప్రస్తుతం ఆయన నిర్మాతగా 5 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవి సరిపోవన్నట్టు కొన్ని సినిమాలను సమర్పిస్తున్నారు కూడా. ఆయన చేస్తున్న అన్ని సినిమాల గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా… 2017 లో ప్రొడ్యూసర్ గా ఆయన గ్రాండ్ హిట్స్ అందుకోబోతున్నారు. ఇక నాకు తెలిసి రెండు ఫిలిం సిటీలున్నాయి ఒకటి సిటీ అవుట్ కట్స్ లో ఉంటే… మరొకటి దిల్ రాజు రూపంలో ఇక్కడుంది.” అంటూ స్పీచ్ ముగించాడు…