టాలీవుడ్ బిగ్ డే

Thursday,December 08,2016 - 03:15 by Z_CLU

టాలీవుడ్ లో అతిపెద్ద రోజు డిసెంబర్ 9. ఈరోజు కోసం ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు. మరికొన్ని గంటల్లో ఆ బిగ్ డే రాబోతోంది. ఈసాారి బిగ్ ఫ్రై డేకు రెండు ప్రత్యేకతలున్నాయి. ఆ రెండు ప్రత్యేకతలు మెగా, అక్కినేని కాంపౌండ్స్ చుట్టూ తిరగుతున్నాయి. వాటిలో ఒకటి ధృవ రిలీజ్ అయితే, ఇంకోటి అఖిల్ ఎంగేజ్ మెంట్.

dhruva-release

మరికొన్ని గంటల్లో ధృవ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. రామ్ చరణ్ హీరోగా, పపర్ ఫుల్ పోలీసాఫీసర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ కోసం మెగాాభిమానులు కొన్ని నెలలుగా కళ్లుకాయలుకాాచేలా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది.

akhil-shriya-bhoopal

డిసెంబర్ 9, శుక్రవారం… కేవలం ధృవ రిలీజ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ లో మరో పెద్ద పండగ కూడా షురూకానుంది. అదే అఖిల్-శ్రియభూపాల్ ల నిశ్చితార్థం. ఇలా సినిమాల్లోకి వచ్చాడో లేదో అప్పుడేే పెళ్లికి ప్రివేర్ అయిపోయాడు అఖిల్. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న శ్రియభూపాల్ తో, రేపు జీవీకేే హౌజ్ లో అఖిల్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీప్రముఖులకు ఆహ్వానాలు అందించాడు నాగార్జున.