ఫ్యామిలీ బాయ్ గా మారిన చైతూ

Thursday,December 08,2016 - 04:48 by Z_CLU

మొన్నటివరకు లవర్ బాయ్ గా కనిపించిన నాగచైతన్య ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ బాయ్ గా మారిపోయాడు. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున కనిపించినట్టు… కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నాగచైతన్య కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేసిన అక్కినేని యువ హీరో… తాజాగా కల్యాణ్ కృష్ణ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ వైజాగ్ లో జరుగుతోంది. చైతన్య- రకుల్ మధ్య కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు.

naga-chaitanya-rakul-preeth-vizag-shooting

ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో డైరెక్టర్ గా తన సత్తా చాటి గ్రాండ్ హిట్ అందుకున్న యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో చైతూను ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘నిన్నే పెళ్లాడతా’ ఫ్లేవర్ తో సాగే ఈ సినిమాతో చైతూ…. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరవుతాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వైజాగ్ షూట్ తర్వాత హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.