చందూ మొండేటి ఇంటర్వ్యూ

Monday,October 29,2018 - 05:02 by Z_CLU

నవంబర్ 2 న గ్రాండ్ గా రిలీజవుతుంది నాగచైతన్య ‘సవ్యసాచి’. సెన్సార్ కూడా క్లియర్ చేసుకుని U/A సర్టిఫికెట్   పొందిన   ఈ    సినిమా   ఓవరాల్ గా   పాజిటివ్  బజ్   చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాంగ్స్, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తే, ఈ సినిమా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు అవి మీకోసం.

ఆర్టికలే రీజన్…

నా మైండ్ లో ఆల్రెడీ వేరే ఒక స్టోరీ ఉంది. ఈ లోపు ఒక ఫ్రెండ్ ద్వారా వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కి సంబంధించి ఒక ఆర్టికల్ చదివాను. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అప్పుడు నేననుకున్న కథలో ఈ సిండ్రోమ్ ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.

ఆ తరవాత…

ఈ ఆలోచనను ఫస్ట్ చైతుతోనే షేర్ చేసుకున్నాను. ఆయన కూడా చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. ఆ తరవాత మళ్ళీ నవీన్, రవి గారు కలిసినప్పుడు, మళ్ళీ ముగ్గురం కలిసి ఈ ఐడియా బావుంటుందని డిసైడ్ అయ్యాం.

టైటిల్ కూడా…

ఎప్పుడైతే ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ స్టోరీలో పార్ట్ అయిందో, అప్పుడే ‘సవ్యసాచి’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సాధారణంగా రైట్ హ్యాండ్ ఎవ్వరికైనా స్ట్రాంగ్ గా ఉంటుంది అదే  రియల్   హీరో. అలాంటి లెఫ్ట్ హ్యాండ్ ఇంకా పవర్ ఫుల్ గా ఉంటుంది. దానికి కూడా పర్టికులర్ గా క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఫిక్సయ్యామో, ఈ టైటిలే పర్ఫెక్ట్ అనుకున్నాం.

అది వేరు…

వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనేది కంప్లీట్ గా వేరు… సినిమాలో ఏదైతే చూపిస్తున్నామో అది జస్ట్ 10% మాత్రమే. ఆ సిండ్రోమ్ ఉన్నవారి బిహేవియర్ కానీ, దాని ఎఫెక్ట్ కానీ చాలా ఉంటుంది.

అందుకే మాధవన్…

మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన అసలు రెగ్యులర్ సినిమాలు చేయరు. ఆయన గ్రాఫ్ లో రాజ్ కుమార్ హిరానీ, మణిరత్నం లాంటి గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉంటారు. అలాంటిది ఆయన, ఈ స్టోరీ చెప్పే చెప్పగానే ‘చాలా బావుంది.. ఈ సినిమా చేస్తున్నాం’ అనగానే ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది.

ఫస్టాఫ్ రిపోర్ట్…

సినిమాలో ఫస్టాఫ్ మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ, స్టోరీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో సినిమాలో చాలా ఫన్ ఉంటుంది.

అందుకే లగ్గాయిత్తు సాంగ్…  

సినిమా సెకండాఫ్ వరకు వచ్చేసరికి కొంచెం సీరియస్ నెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సీరియస్ నెస్ లో కొంచెం రిలాక్సేషన్ లా లగ్గాయిత్తు సాంగ్ ఉండబోతుంది. అది కూడా ఏదో కావాలని పెట్టినట్టు కాకుండా, కథలో బ్లెండ్ అయి ఉంటుంది.

స్టోరీ డామినేషన్…

ఎంత పెద్ద స్టార్ నైనా స్టోరీ డామినేట్ చేస్తుంది. ఈ సినిమాకి కూడా అంతే. కాకపోతే నాగచైతన్య వరకు వచ్చేసరికి, అంత లెగసీ ఉన్న సీనియర్స్ నాగార్జున, వెంకటేష్ లాంటి వారు ఉన్నారు కాబట్టి, గ్రేస్ కోసం అక్కడక్కడా బ్లెండ్ చేయడం జరిగింది. అంతేకానీ దాని వల్ల స్టోరీలో చేంజెస్ ఏం ఉండవు.

చాలా సిచ్యువేషన్స్…  

హీరో లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ లోనే కాకుండా, ప్రతి ఇమోషన్ లో రియాక్ట్ అవుతుంది. సినిమాలో జస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, చాలా ఇమోషన్స్ డ్రైవ్ అవుతుంటాయి.

కార్తికేయ సీక్వెల్…

ప్రస్తుతానికి ఐడియాతో  పాటు 15 నిమిషాల స్టోరీ ఉంది. దాన్ని ఇంకా డెవెలప్ చేయాలంటే ఈ అనుభవం సరిపోదు… ఇంకా ఎదగాలి.

నాగార్జున గారితో సినిమా…

స్క్రిప్ట్ అయితే ఉంది కానీ, అదెలా ముందుకు వెళుతుంది అనేది ఈ సినిమా తర్వాతే తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్…

నేను, నాగచైతన్య సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సింపుల్ గా చేసేద్దాం అనుకున్నాం కానీ, ఎప్పుడైతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఫిక్సయిందో,  చాలా  గ్రాండియర్ ఆడ్ అయింది. భూమిక, మాధవన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో చేశారంటే అది ఈ బ్యానర్ వల్లే…