2.0 ట్రయిలర్.. ఇండియా ఎదురుచూస్తోంది!

Monday,October 29,2018 - 06:01 by Z_CLU

భారత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా

టాప్ క్లాస్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన మూవీ

హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్

ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే 2.0 గురించి ఎన్నో విశేషాలు. మరెన్నో ఎట్రాక్షన్స్. ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ వస్తుందంటే చాలు ఇండియా మొత్తం ఎదురుచూసింది. టీజర్ వచ్చినప్పుడు అదో పెద్ద సెన్సేషన్ అయింది. అలాంటిది ఇప్పుడు ట్రయిలర్ వస్తోంది. అందుకే టోటల్ ఇండియా ఎదురుచూస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఓ భారీ బడ్జెట్ సినిమాను శంకర్ డైరక్ట్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను దీపావళి కానుకగా 3వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ట్రయిలర్ ఇంకా రిలీజ్ అవ్వకముందే దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయింది. ఎక్కడ చూసినా #2Point0TrailerOnNov3 అనే హ్యాష్ ట్యాగ్ మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ట్రయిలర్ రిలీజైన తర్వాత సోషల్ మీడియా మొత్తం 2.0పైనే రన్ అవుతుందేమో.