రవితేజ ‘అమర్ అక్బర్ అంటోని’ టీజర్ రివ్యూ

Monday,October 29,2018 - 04:37 by Z_CLU

‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్ రిలీజ్ అయింది. రవితేజ  3 డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ రేజ్ చేస్తుంది ఈ సినిమా టీజర్.

‘ముగింపు రాసుకున్న తరవాతే కథ మొదలుపెట్టాలి..’ అని బిగిన్ అయిన టీజర్, రవితేజని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తుంది. రవితేజ రెగ్యులర్ మార్క్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా, సినిమా స్టోరీపై కాన్సంట్రేషన్ నిలిచేలా చేస్తుందీ 00: 56 సెకన్ల టీజర్.

‘మనకు నిజమైన ఆపద వచ్చినప్పడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం..’ అనే డైలాగ్, కనిపించింది కాసేపే అయినా ఇలియానా కమ్ బ్యాక్ ప్రెజెన్స్, సినిమాపై అంచనాలు పెంచుతుంది.

ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మరియు మోహన్ చెరుకూరి సంయుక్తంగా  ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు.