SatyaDev 'గాడ్సే' ట్రైలర్ రివ్యూ

Thursday,June 09,2022 - 12:44 by Z_CLU

SatyaDev’s ‘Godse’ Trailer Review

సత్య దేవ్ హీరోగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్సే’ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. నిమిషం యాబై సెకన్ల నిడివితో రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది.

సత్యమేవ జయతే అంటారు” , “దర్మోరక్షతి రక్షితః అంటారు” , కానీ సమాజంలో సత్యం , ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవడం లేదు అంటూ సత్య దేవ్ ఇంటెన్స్ తో చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో సురేష్ సారంగం విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ గ్లిమ్స్ , సాండీ అద్దంకి స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా సత్య దేవ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సమాజం మీద అలాగే రాజకీయ నాయకుల మీద తన ఆగ్రహాన్ని చూపించే పౌరుడిగా సత్య దేవ్ నటన సినిమాకు హైలైట్ గా నిలవనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే కథలో హీరోయిన్ ఐశ్వర్య లెక్ష్మి కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కిందని ఆమె పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకు ప్లస్ అవ్వనుందని విజువల్స్ చూస్తే తెలుస్తుంది.

‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత సత్య దేవ్ – గోపి గణేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమా ఉండనుందని ట్రైలర్ కట్ తో క్లియర్ కట్ గా చెప్పారు మేకర్స్. CK స్క్రీన్స్ బేనర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వబోతుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics