Nayan Wikki Wedding భార్యాభర్తలుగా మారిన నయనతార-విఘ్నేష్

Thursday,June 09,2022 - 03:23 by Z_CLU

Nayanthara Vignesh Shivan wedding photo out

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. ఈరోజు ఉదయం మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ హోటల్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. నయన్ మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను శాస్త్రోక్తంగా పెళ్లాడాడు విఘ్నేష్. తొలి ఫొటోను కూడా షేర్ చేశాడు.

ముందుగా తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ జంట. కానీ సెలబ్రిటీలందరికీ అందుబాటులో ఉండేందుకు వేదికను మహాబలిపురానికి మార్చారు. ఈ పెళ్లికి షారూక్ ఖాన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు అట్లీ, సూర్య -జ్యోతిక, హీరో కార్తి పలువురు పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయన్-విఘ్నేష్. ఆ తర్వాత కొన్నాళ్లకే తాము ప్రేమించుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు. ఎప్పటికప్పుడు ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లారు. అలా పూర్తిగా ఒకర్నొకరు అర్థం చేసుకున్న తర్వాత, గతేడాది వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. తామిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిన విషయాన్ని నయనతార స్వయంగా కన్ ఫర్మ్ చేసింది.

అప్పట్నుంచి వీళ్లిద్దరి పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు అన్ని రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఈరోజు నయన్-విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే చెన్నైలో టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులకు ఈ జంట బిగ్ పార్టీ ఇవ్వబోతోంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics