Vikram Success టీంకి కమల్ భారీ బహుమతులు

Wednesday,June 08,2022 - 04:56 by Z_CLU

Kamal Haasan gifts Car to DIrector Lokesh and Rolex watch to Suriya for Vikram Success

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్ళు రాబడుతుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల(గ్రాస్) మార్క్ కి చేరువలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా సక్సెస్ పార్టీ చేసుకున్నారు యూనిట్. ఇక కమల్ తన మంచి మనసు చాటుకొని నిర్మాతగా టీం గిఫ్ట్లులు అందజేశారు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి  కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే సినిమా క్లైమాక్స్ లో  రోలెక్స్ అనే ఇంపార్టెంట్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన సూర్యకి రోలెక్స్ వాచ్ ను బహుమతిగా అందించారు కమల్. అంతే కాదు విక్రమ్ సినిమాకు పనిచేసిన పద మూడు మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కి గిఫ్ట్ గా బైకులు అందించాడు. ఇంకా సినిమాకు పనిచేసిన మిగతా టీంకి కూడా కొన్ని  బహుమతులు అందించి నిర్మాతగా మంచి మనసు చాటుకున్నారు కమల్.

తెలుగులో కూడా విక్రమ్ భారీ వసూళ్ళు రాబడుతుంది. రెండు రాష్ట్రాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయిందని సమాచారం. విక్రమ్ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ తో కమల్ త్వరలోనే ‘శబాష్ నాయుడు’, ‘భారతీయుడు 2’, సినిమాల షూటింగ్స్ కంటిన్యూ చేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే కమల్ తో భారతీయుడు 2 మరో షెడ్యుల్ మొదలు పెడతాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics