సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలనికోరుకుంటున్నాను

Saturday,July 27,2019 - 07:41 by Z_CLU

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.  జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా భారీ వసూళ్ళు సాదిస్తూ గ్రాండ్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్య దేవ్ మాట్లాడుతూ “ఈ సినిమా రిలీజ్ రోజు నేను  కాశ్మీర్ లో షూటింగ్‌లో ఉన్నాను. ఫోన్ చేసి అడిగితే హిట్ అన్నారు. నేను నమ్మలేదు నాకు తెలిసిన థియేటర్ ఓనర్‌కి ఫోన్ చేశాను. పెద్ద హిట్ అని చెప్పారు. ఇంత పెద్ద విజయం లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పూరి గారు ఒక డ్రగ్. దానికి అలవాటు అయితే అంతే. ఇది కేవలం తొమ్మిది రోజుల కలెక్షన్. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయాలనికోరుకుంటున్నాను.” అని అన్నారు.