బాలయ్య సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఫిక్స్

Saturday,July 27,2019 - 12:53 by Z_CLU

త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది బాలయ్య, కేఎస్ రవికుమార్ సినిమా. ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా భూమికను ఫిక్స్ చేశారు. ఇప్పటికే క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయిన భూమికకు, ఈ సినిమాలో మంచి రోల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాలో ఇప్పటికే సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం భూమికను తీసుకున్నారు. వీళ్లిద్దరితో పాటు మూవీలో మరో హీరోయిన్ కు కూడా చోటుందట. ఆ థర్డ్ హీరోయిన్ ను త్వరలోనే ఫైనలైజ్ చేస్తారు.

జై సింహా తర్వాత బాలయ్య-కేఎస్ రవికుమార్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ ప్లాన్స్ నుంచి తప్పుకున్నారు.