ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్న మాస్ రాజా...

Saturday,December 17,2016 - 10:18 by Z_CLU

పూరి జగన్నాధ్ చెప్పింది నిజమే. ఈ ప్రపంచాన్నే చుట్టేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడు. దాదాపు 7 నెలలుగా అదే పనిలో ఉన్నాడు. ఫ్యాన్స్ అంతా తమ హీరో కొత్త సినిమా ఎనౌన్స్ చేస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. కానీ రవితేజ మాత్రం విహారయాాత్రలకే ప్రాధాన్యం ఇచ్చాడు. ఇప్పుడు చూడకపోతేం మరి చూడలేం అనే ఫీలింగ్ కు వచ్చాడో ఏమో… వివిధ దేశాల్లో తెగ రౌండ్స్ కొడుతున్నాడు.

ప్రస్తుతం మాస్ రాజా జమైకాలో ఉన్నాడు. దాదాప 17 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా జమైకా సాగరతీరంలో ఫ్రెండ్స్ తో ఖుషీఖుషీగా గడిపేస్తున్నాడు. మరోవైపు వచ్చే ఏడాది ఓ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా ఉంటుంది.