కీలకమైన పని పూర్తిచేసిన కాటమరాయుడు...

Friday,December 23,2016 - 10:25 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీకి సంబంధించి మరో కీలకమైన అప్ డేట్. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ తాజాగా పూర్తయ్యాయి. సినిమాకు సంబంధించిన సంగీత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ ప్రకటించాడు. కాటమరాయుడు సినిమాలో మొత్తం 6 పాటలుంటాయని, అన్ని ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని అంటున్నాడు. అంతేకాదు.. కాటమరాయుడు ఆల్బమ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ ఆల్బమ్ గా నిలిచిపోతుందని కూడా ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాడు అనూప్.

ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ పొలాచ్చిలో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్ తో సినిమా టాకీ దాదాపు పూర్తయిపోతుంది. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కు తమ్ముళ్లుగా కమల్ కామరాజు, శివబాలాజీ, చైతన్యకృష్ణ, అజయ్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.