శాతకర్ణి జైత్రయాత్ర

Tuesday,November 01,2016 - 12:10 by Z_CLU

స్టార్స్ కి ఓ మోస్తరు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలే. కానీ బాలయ్యకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన పట్ల ఫ్యాన్స్ కి ఉన్న తపన చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. బాలయ్య తన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణీ ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఏదో రకంగా తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.

మొన్నటికి మొన్న కడపలోని ఒక థియేటర్ లో బాలయ్య కరియర్ లోని సినిమాలన్నీ ప్రదర్శించాలని డిసైడ్ అయితే మరో వైపు దేశంలోనే 100 పుణ్య‌క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చ‌నతో పాటు 23 శివ‌లింగాల‌కు రుద్రాభిషేక, స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

balayya

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమం న‌వంబ‌ర్ 5న, శ‌నివారం ఉద‌యం గం.10.45ని. ల‌కు స్వయంగా బాలయ్య చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఎన్‌.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ జగ‌న్ అండ్ టీమ్ ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా దేశంలోని శత పుణ్యక్షేత్ర జైత్ర యాత్రను అట్టహాసంగా నిర్వహించనున్నారు ఫ్యాన్స్.