3 రోజుల్లో 11 కోట్లు

Tuesday,November 01,2016 - 12:04 by Z_CLU

ఆవారా, ఊపిరి సినిమాలతో టాలీవుడ్ లోను తనకంటూ ఓ స్పెషల్ స్పేస్ ను క్రియేట్ చేసుకున్న కార్తీ… కాష్మోరా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాడు. సరికొత్త స్టోరీలైన్ దానికి తోడు హైఎండ్ టెక్నికల్ వాల్యూస్ వాటి మధ్య కార్తీ, నయనతార… ఈ హంగులతో సినిమా హిట్టని తొలిరోజే తేలిపోయింది.

నయన తార సినిమాలో కనిపించింది కాసేపే అయినా, తన మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. గోకుల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కాష్మోరా అటు చిన్న పిల్లలతో పాటు యూత్, మాస్ అంటూ తేడా లేకుండా అందరినీ అలరిస్తూ మూడు రోజుల్లోనే ఏకంగా 11 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కార్తీ సరసన శ్రీ దివ్య కూడా నటించింది.