సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ డేట్

Tuesday,November 19,2019 - 07:01 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

సరిలేరు నీకెవ్వరు టీజర్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని గ్లింప్స్ రిలీజ్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. జస్ట్ 4-5 సెకెన్లు మాత్రమే ఉన్న ఆ విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని బేస్ చేసుకొని తయారుచేసిన ఎన్నో వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ ట్రెండ్ ను మరింత కొనసాగిస్తూ, ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మహేష్ పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కోసం ముస్తాబవుతోంది.