మెగాస్టార్ సినిమాకు మణిశర్మ సంగీతం?

Tuesday,November 19,2019 - 03:29 by Z_CLU

చిరంజీవి సినిమాలకు మణిశర్మ సంగీతం అందించడం కొత్తేంకాదు. వీళ్లిద్దరి కాంబోలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరూ కలవబోతున్నారు. మెగాస్టార్ సినిమాకు మణిశర్మ సంగీతం అందించబోతున్నాడనే టాక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

త్వరలోనే కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు చిరంజీవి. ఈ సినిమా కోసం బాలీవుడ్ సంగీత దర్శకుల పేర్లు పరిశీలించారు. అయితే ఫైనల్ గా మణిశర్మకు ఆ ఛాన్స్ దక్కినట్టు టాక్. ప్రస్తుతానికి ఇంకా కన్ ఫర్మ్ కానీ ఈ మేటర్ లో 90 పర్సెంట్ నిజం ఉందంటున్నారు సినీజనాలు.

ఇస్మార్ట్ శంకర్ తో తన సత్తా చాటారు మణిశర్మ. ఆ సినిమాకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడంతో పాటు సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఇచ్చాడు. చిరంజీవి సినిమా కోసం మణిశర్మ పేరు చర్చకు రావడానికి కూడా ఇదే కారణం.