"సరిలేరు.." షూటింగ్ అప్ డేట్స్

Wednesday,September 18,2019 - 12:54 by Z_CLU

మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్, తాజాగా రామోజీ ఫిలింసిటీలో మరో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసింది.

కర్నూల్ కు చెందిన కొండారెడ్డి బురుజు సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేశారు. ఈ సెట్ లో సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ ను పిక్చరైజ్ చేశారు. ఇందులో భాగంగా ఓ భారీ ఫైట్ తీశారు.

నెక్ట్స్ షెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సన్నివేశాలు తీయబోతున్నారు. వచ్చే షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి 70శాతం టాకీ పూర్తయినట్టవుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. నటి విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు,మహేష్ బాబు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తుంది ఈ సినిమా.