Sanjay Rao GUTTU CHAPPUDU - బ్రహ్మాజీ కొడుకు మరో సినిమా
Sunday,May 30,2021 - 11:07 by Z_CLU
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు, ఓ పిట్ట కథ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. గుట్టు చప్పుడు సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. నేను చేసిన పిట్టకథ సినిమాలోని పాత్రకు ఇది పూర్తీ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నాకు దర్శకుడు మణీంద్రన్ చెప్పినప్పుడు అయన చెప్పిన కథ కంటే కూడా అయన ఇచ్చిన నేరేషన్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్, షార్ట్ డివిజన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలతో కథను చెప్పారు .. కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ .. అన్నిరకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి.” అన్నారు.

GUTTU CHAPPUDU సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు షెడ్యూల్స్ ఉన్నాయి .. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతారు. అనుకున్న టైమ్ కు సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్.
యూత్ ను బేస్ చేసుకొని తీస్తున్న సినిమా ఇది. కథ మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. మాస్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నారు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics