Nikhil 18 Pages - ప్రీ లుక్ అదిరింది

Sunday,May 30,2021 - 11:00 by Z_CLU

అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా ఇది.

జీఏ2పిక్చ‌ర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ప్రొడ్యూ్ చేస్తున్న ఈ సినిమాకు సూర్యప్రతాప్ దర్శకుడు.

జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా 18 పేజీస్ ప్రీ లుక్ విడుదల చేశారు.

Nikhil 18 Pages Pre Look zeecinemalu 1

నిఖిల్ క‌ల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో పాటు.. నిఖిల్-అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం లో వస్తున్న సినిమా కావడంతో.. 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌ర్లో అస‌క్తి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics