SR Kalyana Mandapam - ముందుగా థియేటర్లలోనే

Sunday,May 30,2021 - 11:12 by Z_CLU

రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్-రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం.

ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన “”చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు”” యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల వల్ల అనేక సినిమాలు డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుద‌లకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే, కానీ SR Kalyana Mandapam చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లోనే విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్ర‌మోద్ – రాజులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics