ఇన్నాళ్ళకి సెట్స్ పైకి వచ్చిన సమంత

Wednesday,January 25,2017 - 11:42 by Z_CLU

సమంతా మళ్ళీ బిజీ అయిపోయింది. కోలీవుడ్ లో ఒకేసారి రెండేసి సినిమాలతో సెట్స్ పైకి వచ్చేసింది స్యామ్. ఆ రెండు సినిమాలతో పాటు కన్నడలో బ్లాక్స్ బస్టర్ అయిన ‘U Turn’ సినిమా రీమేక్ విషయంలో డిస్కషన్స్ కూడా జరుపుతుంది.

లాస్ట్ ఇయర్ పవన్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘U Turn’ సినిమా కన్నడ ఇండస్ట్రీని వసూళ్లతో కుదిపేసింది. ఇప్పుడా సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని డిసైడ్ అయిన సినిమా యూనిట్, సమంతా హీరోయిన్ గా చేస్తే బావుంటుందని లాస్ట్ ఇయర్ నుండే అప్రోచ్ అవుతున్నారు.

ఈ సినిమా విషయంలో అఫీషియల్ గా ఇంకా ఏ అనౌన్స్ మెంట్ బయటికి రాలేదు కానీ, రీసెంట్ గా చైతు, సమంతా ఈ సినిమా డిస్కషన్స్ కోసం బెంగళూరుకి కూడా వెళ్ళారని సమాచారం. చూస్తుంటే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఎక్కువ టైం పట్టదు ఇన్ సైడ్ సోర్సెస్ ఫీలింగ్.