రామ్ చరణ్ హీరోయిన్స్..

Wednesday,January 25,2017 - 10:14 by Z_CLU

రీజన్స్ పెద్దగా తెలీదు కానీ, రామ్ చరణ్ సినిమాలో అనుపమ ఇక లేనట్టే. తనను వద్దు అనుకోవడానికి రీజన్స్ అయితే బయటికి రాలేదు. అనుపమ ప్లేస్ ని రీప్లేస్ చేయబోయే హీరోయిన్ ఎవరా అని క్వశ్చన్స్ మాత్రం బోలెడు రేజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ అప్పుడే సో అండ్ సో హీరోయిన్ అయితే బావుంటుందని సజెషన్స్ కూడా షురూ చేసేశారు.

jodi-_-1

మ్యాగ్జిమం టాప్ యంగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంతా ఇప్పటి వరకు చెర్రీ కి హీరోయిన్ గా నటించలేదు. అసలే 90’s బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీ. సమంతా కానీ చెర్రీతో జోడి కట్టిందంటే టాలీవుడ్ వైబ్రేట్ అవ్వడం గ్యారంటీ.

jodi-_-2

ఇప్పటికే శిరీష్ సరసన నటించి మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టేసిన రెజీనా, మంచి బ్రేక్ ఇచ్చే వెంచర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ వెయిటింగ్ కి గాని ఈ సినిమాతో బ్రేక్ పడితే, రెజీనా స్టార్ హీరోయిన్ లిస్టులో రిజిస్టర్ అయిపోయినట్టే.

jodi-_-3

ఒక్కో సినిమాతో టాలీవుడ్ పర్మనెంట్ ప్లేస్ వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్న రాశిఖన్నాకి ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుండి ఒక్క కాల్ కూడా రాలేదు. చెర్రీ కో, సుక్కు కో…  ఏ ఒక్క పాయింట్ లోనైనా రాశి అయితే బావుంటుంది అని చిన్న ఫీలింగ్ కలిగినా, రాశి డార్లింగ్…  రైజింగ్ స్టార్స్ క్యాటగిరీ నుండి ప్రమోట్ అయిపోతుంది.

jodi-_-4

ఒక్క సినిమాతోనే న్యాచురల్ ఆక్ట్రెస్ ట్యాగ్ ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్, టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ట్రెమండస్ స్టార్ డం క్రియేట్ అయిన కీర్తికి, మెగా ట్యాగ్ కూడా పడిందంటే… టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి కాంపిటీషన్ ముదిరినట్టే.

jodi-_-5

ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఇచ్చేసిన లావణ్య, శిరీష్ తరవాత ఇప్పుడు వరుణ్ తేజ్ మిస్టర్ లోను ఎట్రాక్ట్ చేస్తుంది. సో ఎలాగూ కళ్ళ ముందు కదులుతుంది కాబట్టి, ఫిక్స్ అయిపోతే పోలా అని సుక్కు కి అనిపించినా, చెర్రీకి అనిపించినా, లావణ్య కరియర్ కి మెగా పవర్ స్ట్రోక్ తగిలినట్టే.

ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ అవ్వలేదో..? లేకపోతే టైం చూసుకుని అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో తెలీదు కానీ, సుక్కు సినిమాలో చెర్రీ పక్కన ఖాళీ ప్లేస్ ఫ్యాన్స్ లో విపరీతమైన సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. మరి ఈ సస్పెన్స్ కి బ్రేక్ ఎప్పుడు పడుతుందో చూడాలి.