అల వైకుంఠపురములో.. ఆ పాటతోనే ప్రచారం

Tuesday,December 31,2019 - 12:02 by Z_CLU

ఈ సినిమాకు ఓ ఊపు, క్రేజ్ తీసుకొచ్చిన పాట సామజవరగమన. ఈ పాటతోనే లిరికల్ వీడియోస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదే పాటతో టీజర్లు కూడా మొదలుపెట్టారు. సామజవరగమన సాంగ్ ప్రోమో రిలీజైంది. ఆడియో ఏ రేంజ్ లో హిట్ అయిందో, వీడియో ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంది.

ఈ ప్రోమో రిలీజ్ కు ముందే తమన్ ఓ మాటన్నాడు. జమ్ముకశ్మీర్ కు వెళ్లినప్పుడు రోజాలో ఓ పాట ఎలాగైతే గుర్తొస్తుందో.. పారిస్ వెళ్లినప్పుడు సామజవరగమన సాంగ్ అలా గుర్తొస్తుందన్నాడు. అదే నిజమయ్యేలా ఉంది. అందమైన లొకేషన్లతో పాటు బన్నీ స్టయిలిష్ డాన్స్ ఈ పాటకు ఎక్స్ ట్రా లుక్, ఫీల్ తీసుకొచ్చింది.

సాంగ్ ఎంత క్లాసీగా ఉందో, విజువల్స్ పరంగా అంతే రొమాంటిక్ గా ఉంది. పూజా హెగ్డేను తన కెరీర్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ గా ఈ సాంగ్ లో చూపించాడట దర్శకుడు త్రివిక్రమ్. ఈ పాటలో నవదీప్, రాహుల్ రామకృష్ణ కూడా కనిపిస్తారనే విషయం ప్రోమో చూస్తే అర్థమౌతోంది.