ఈసారి Mega Item Girl ఆ హీరోయిన్?

Tuesday,December 31,2019 - 11:47 by Z_CLU

మెగాస్టార్ చిరు 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ లో ‘రత్తాలు రత్తాలు’ అనే ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.. ఆ సాంగ్ లో లక్ష్మి రాయ్ అందాలతో కనువిందు చేసి కుర్రకారుని విపరీతంగా ఎట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి  ఐటెం సాంగ్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు మెగా స్టార్.

అవును… చిరు-కొరటాల సినిమా మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కి హీరోయిన్ ని కూడా ఫైనల్ చేశారు. ఈసారి మెగా ఐటెం సాంగ్ లో చిరుతో కలిసి రెజీనా హాట్ స్టెప్స్ వేయబోతుంది.

లేటెస్ట్ గా ఈ ఐటెం సాంగ్ ను కంపోజ్ చేసి రికార్దింగ్ కూడా పూర్తి చేశాడట మణిశర్మ. మొదటి షెడ్యుల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించిన తర్వాత.. చిరు-రెజీనా ఐటెం సాంగ్ షూటింగ్ ఉంటుందట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్ , నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.