2019 గూగుల్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Tuesday,December 31,2019 - 01:39 by Z_CLU

సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ట్రెండ్ అయిన సినిమాకే ఎక్కువ రీచ్ ఉంటుంది. అలా రీచ్ అయిన సినిమాకే ఎక్కువ వసూళ్లు కూడా ఉంటాయి. అలా 2019లో గూగుల్ లో అత్యథికంగా ట్రెండ్ అయిన సినిమాగా కబీర్ సింగ్ నిలిచింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది.

కాస్త నిరాశ కలిగించే విషయం ఏంటంటే.. 2019 టాప్-10 గూగుల్ ట్రెండింగ్స్ లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాకు కూడా స్థానం దక్కలేదు. నిజానికి టాప్-10లో మహర్షి లేదా సాహో నిలుస్తుందని అంతా భావించారు. కానీ తెలుగు సినిమానే కాదు, సౌత్ నుంచి ఏ ఒక్క సినిమాకు టాప్-10లో స్థానం దక్కలేదు.

గూగుల్ టాప్-10 ట్రెండింగ్ మూవీస్ (ఇండియా)
1. కబీర్ సింగ్
2. ఎవెంజర్స్ ఎండ్ గేమ్
3. జోకర్
4. కెప్టెన్ మార్వెల్
5. సూపర్ 30
6. మిషన్ మంగల్
7. గల్లీ బాయ్
8. వార్
9. హౌజ్ ఫుల్ 4
10. యూరి – ది సర్జికల్ స్ట్రయిక్