జీ సినిమాలు ( 23rd జూన్ )

Friday,June 22,2018 - 10:06 by Z_CLU

 గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

==============================================================================

ముత్తు

నటీనటులు : రజినీకాంత్మీనా

ఇతర నటీనటులు : రఘువరన్శరత్ బాబుజయ భారతివడివేలుకాంతిమతిరాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తుఅతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.  

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్, నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

 ప్రేమించుకుందాం రా

నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

==============================================================================

మాతంగి

నటీనటులు : రమ్య కృష్ణన్, జయరామ్

ఇతర నటీనటులు : ఓం పురి, శీలు అబ్రహాం, రమేష్ పిషరోది, సాజు నవోదయ, అక్షర కిషోర్, ఏంజిలిన అబ్రహాం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ

డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం

ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్, నౌషాద్ అలాతుర్

రిలీజ్ డేట్ : 20 మే 2016

సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడుతన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందనిఅందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో  ఆత్మగా మారిన మాతంగి ఎవరు…?  మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

==============================================================================

కథకళి

నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా

ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ

డైరెక్టర్ : పాండిరాజ్

ప్రొడ్యూసర్ : పాండిరాజ్

రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 

విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

ఆ ఇంట్లో

నటీ నటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.