రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయి ధరం తేజ్ సినిమా

Wednesday,January 16,2019 - 11:40 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ‘నేను శైల‌జ’ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 12 న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ లో ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.