మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్

Wednesday,January 16,2019 - 12:14 by Z_CLU

సంక్రాంతి సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేశాయి. వాటి రిజల్ట్స్ కూడా తేలిపోయాయి. ఇప్పుడు మజ్ను టర్న్. అవును.. సంక్రాంతి తర్వాత మరో వేడుకకు ఆహ్వానిస్తున్నాడు మిస్టర్ మజ్ను. ఈనెల 25 నుంచి థియేటర్లలో సరికొత్త పండగ తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

ఈనెల 19న మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే జూక్ బాక్స్ రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు అదే స్పీడ్ లో మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు.

అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.