'MCA' కాంబో మళ్ళీ వస్తోంది !

Sunday,February 23,2020 - 01:05 by Z_CLU

ఊహించని కలెక్షన్స్ వసూళ్లు సాదించి నాని కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది ‘MCA’. సినిమాలో నాని , సాయి పల్లవి కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.  ఇప్పుడీ హిట్ పెయిర్ మళ్ళీ ఓ సినిమా కోసం కలుస్తోంది. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్న నాని ఈ సినిమా తర్వాత రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్ లో థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా కోసమే నాని , సాయి పల్లవి కలుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఆ అనౌన్స్ మెంట్ తో పాటే సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. సితార ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా మే లేదా జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.