వరుణ్ తేజ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ !

Sunday,February 23,2020 - 03:34 by Z_CLU

వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నఈ సినిమాకు సంబంధించి కొంత మంది హీరోయిన్స్ ను ఆడిషన్ చేసిన మేకర్స్ ఫైనల్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మజ్రేకర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని తెలుస్తుంది.

 

బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా  షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు వరుణ్.అల్లు బాబీ , సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.