సాయి ధరమ్ తేజ్ లాంచ్ చేయనున్న ’టిక్..టిక్..టిక్..’ ట్రైలర్

Wednesday,January 17,2018 - 06:44 by Z_CLU

ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఫస్ట్ స్పేస్ మూవీ ‘టిక్.. టిక్.. టిక్..’. ఈ మూవీ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రేపు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానుంది.

టెక్నికల్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా శక్తి సుందర్ రాజన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. జయం రవి సరసన నివేత పేతురాజ్ నటించిన ఈ మూవీ ట్రైలర్ మూవీ లవర్స్ ని ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేయనుందో రేపు తెలిసిపోతుంది.  V. హితేష్ జబాక్ నిర్మించిన ఈ సినిమాకి D. ఇమ్మన్ మ్యూజిక్ కంపోజర్.