సెట్స్ పైకి రానున్న నాగచైతన్య మారుతి సినిమా

Wednesday,January 17,2018 - 06:08 by Z_CLU

ప్రస్తుతం సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మారుతి డైరెక్షన్ లో సినిమాని అనౌన్స్ చేసిన చైతు, ఈ నెల 19 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. సినిమా సినిమాకి గ్యాప్ లేకుండా ఫాస్ట్ పేజ్ లో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నాగచైతన్య ఈ సినిమాలో డిఫెరెంట్ గా కనిపిస్తాడని చెప్తుంది సినిమా యూనిట్.

నాగ చైతన్య సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు టాక్ నడుస్తున్నా, ఇప్పటి వరకు సినిమా యూనిట్ ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఇమోషనల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు, ఆరోగెంట్  లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన టెక్నీషియన్స్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.