అనుష్క భాగమతి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Wednesday,January 17,2018 - 07:26 by Z_CLU

జనవరి 26 న రిలీజ్ కానుంది అనుష్క భాగమతి. ఇంటెన్సివ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆల్మోస్ట్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిన సినిమా యూనిట్, రేపు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు.

త్వరలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, సినిమాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ ఆక్యుపై చేసే ‘మందార మందార’ అనే సాంగ్ లిరికల్ వీడియో ని రేపు 1:10 నిమిషాలకు రిలీజ్ చేయనుంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విషయం తెలిసిందే.

U.V. క్రియేషన్స్ బ్యానర్ పై G. అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉన్ని కృష్ణన్, జయరాం సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.