ఇతడే విన్నర్

Saturday,October 15,2016 - 04:00 by Z_CLU

సాయిధరమ్ తేజ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. క్రేజ్ తెచ్చుకున్న తర్వాత వచ్చిన పుట్టినరోజు కావడంతో.. సోషల్ మీడియా మొత్తం తేజు బర్త్ డే సెలబ్రేషన్స్ తో నిండిపోయింది. ఈ పండగ వాతావరణాన్ని మరింత పెంచేందుకు తేజు తన కొత్త సినిమా టైటిల్ ను కూడా ప్రకటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తేజు చేస్తున్న సినిమాకు విన్నర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ తో ఓ పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.

cuv8p-buaaa5vtf

డైరెక్టర్ గోపి చంద్ తో కలిసి ‘విన్నర్’ గా రాబోతున్న తేజూ… మరో వైపు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘నక్షత్రం’ లో ఓ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు హీరో గా తనకు గుర్తింపు అందించిన దర్శకుడు ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి తో కూడా ఓ సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు.