ఈసారి కూడా అదే హైలెట్

Saturday,October 15,2016 - 04:18 by Z_CLU

ఇజం సినిమాలో కొత్త కల్యాణ్ రామ్ ను చూస్తారని పూరి జగన్నాధ్ ఇప్పటికే ప్రకటించాడు. సినిమాలో నందమూరి హీరో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నాడు కాబట్టి న్యూలుక్ అదిరిపోయిందని అంతా అనుకున్నారు. కాని పూరి జగన్నాధ్ ఆ వెర్షన్ లో మాట్లాడలేదు. సినిమాలో క్యారెక్టర్ పరంగా కల్యాణ్ రామ్ ను కొత్తగా చూస్తారని అన్నాడు. మరీ ముఖ్యంగా ఇజం సినిమాకు టెంపర్ ను ఫాలో అయిపోయాడు పూరి.

nh

టెంపర్ సినిమాలో కోర్టు సీన్ హైలెట్. సినిమాను ఓ మలుపుతిప్పింది ఆ సన్నివేశమే. సేమ్ టు సేమ్ అదే కోర్టు ఎపిసోడ్ ఇజంలో కూడా ఉంది. ఆ సీన్ లో సరికొత్త కల్యాణ్ రామ్ ను చూస్తారని అంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. తాజాగా కోర్టు సీన్ లో కల్యాణ్ రామ్ నటించిన ఓ స్టిల్ ను విడుదలచేశారు. ఈనెల 21న విడుదలకానున్న ఇజం సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ నడుస్తోంది.