కాజల్ పై మరో హాట్ గాపిస్

Saturday,August 24,2019 - 04:51 by Z_CLU

ఓ సినిమాకు కాజల్ 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందంటే నమ్మొచ్చు. అదే ఓ సినిమాలో పాటకు ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందంటే నమ్మగలమా? సరిగ్గా ఇలాంటి గాసిప్పే ఒకటి కాజల్ పై వైరల్ అవుతోంది. ఓ సింగిల్ సాంగ్ కోసం ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందట. పైగా అది సాహో సినిమాలో సాంగ్.

రీసెంట్ గా సాహో నుంచి వచ్చిన బ్యాడ్ బాయ్ సాంగ్ ఎంత హిట్ అయిందో అందరం చూశాం. ఈ పాటల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో హాట్ గా, ఇంకెంతో గ్లామరస్ గా సాంగ్ ను రక్తికట్టించింది. అయితే ఈ పాట కోసం ముందుగా కాజల్ ను సంప్రదించారట మేకర్స్

తెలుగు-హిందీ కనెక్ట్ ఉన్న హీరోయిన్ కోసం వెదికే క్రమంలో కాజల్ ను కన్సల్ట్ చేశారట మేకర్స్. అయితే కాజల్ ఈ ఒక్క సాంగ్ కోసం 2 కోట్లు డిమాండ్ చేసిందట. అందుకే ఆమె స్థానంలో జాక్వెలిన్ ను తీసుకున్నారనేది లేటెస్ట్ రూమర్. ఈ పుకారుపై ఎవ్వరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ గాసిప్ మరింత వైరల్ అవుతోంది.