వెంకీ మామ: రాశి రోల్ ఇదే

Saturday,August 24,2019 - 05:02 by Z_CLU

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా వెంకీ మామ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశిఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా నుంచి రాశి ఖన్నా రోల్ రివీల్ అయింది. వెంకీ మామ సినిమాలో స్కూల్ టీచర్ గా కనిపించనుంది రాశిఖన్నా.

బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మిలట్రీ గెటప్ లో నాగచైతన్య కనిపించబోతున్నాడు. చైతూకు మేనమామగా రియల్ లైఫ్ పాత్ర పోషిస్తున్నాడు వెంకటేశ్. వెంకీ ప్రేయసిగా పాయల్ కనిపించనుంది. వెంకీ-చైతూ ఉంటున్న ఊరిలో స్కూల్ టీచర్ గా కనిపించనుంది రాశి.

సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.