బ్యాడ్‌ టైమ్‌లో బ్యాడ్‌ ప్లేస్‌లో ఓ అమ్మాయి

Saturday,August 24,2019 - 04:42 by Z_CLU

బ్యాడ్‌ టైమ్‌లో బ్యాడ్‌ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఎలా తప్పించుకుంది? అనే డిఫరెంట్ స్టోరీలైన్ తో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్‌ వర్మ, కాలకేయ ప్రభాకర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంఛ్ అయింది.

శ్రీశక్తి స్వరూప క్రియేషన్స్ బ్యానర్ పై ఏవిఆర్‌ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు.

ద‌ర్శ‌కుడు సుబ్బు మాట్లాడుతూ…నేను ఈ ప్రొఫెష‌న్‌లోకి రాక‌ముందు ఆర్కిటెక్ గా ప‌ని చేసేవాడ్ని ఒక ఫొటో వంద మాట‌లు చెపుతుంది అన్న‌ట్లు ఒక సినిమా వెయ్యి మాట‌ల‌ను చెపుతుంది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ప్రొడ్యూస‌ర్స్‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అభిరామ్ కృతిక చాలా బాగా న‌టించారు. మా ఎడిట‌ర్ అమ‌ర్ చాలా బాగా ఎడిట్ చేశారు. నాకు ఈ జోన‌ర్ చాలా కంఫ‌ర్ట్ అనిపించింది.

బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ…ఒక థ్రిల్లింగ్ చిత్రాన్ని ఇంత దూరం తీసుకురావ‌డ‌మే చాలా క‌ష్టం. షూటింగ్ వ‌ర‌కు తీసుకువెళ్ళాక నాలాంటి వారు కొన్ని మాప్పులు చెపుతారు కొంచం, కామెడీ యాడ్ చెయ్య‌మ‌ని, కొన్ని మాట‌ల‌ని, కొంత ల‌వ్ యాడ్ చెయ్య‌మ‌ని ఇలా అంటుంటారు. కాని వీళ్ళు అమెరికా నుండి వ‌చ్చిన ఒక ద‌ర్శ‌కుడిని న‌మ్మి ఈ అవ‌కాశం ఇవ్వ‌డం. ఈయ‌న వాళ్ళ‌ని న‌మ్మించ‌డం చాలా గ్రేట్ వారిద్ద‌రికి ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. చాలా మంది అనుకుంటారు విదేశాల్లో చ‌దువుకుని వ‌స్తారు వీళ్ళ‌కు సినిమాల ఏమి తెలుసు అని అనుకుంటారు. కాని శేఖ‌ర్‌క‌మ్ముల‌, అడ‌విశేషు ఇలా చాలా మంది విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్లు ఈ ప్ర‌పంచాన్నే క్రియేట్ చెయ్య‌గ‌ల‌రు అని అన్నారు.