'ఆర్ ఆర్ ఆర్' డేట్ మారింది !

Wednesday,February 05,2020 - 07:01 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది జులై 30న విడుదల కావాల్సిన  సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా  థియేటర్స్ లోకి రానున్నట్లు తెలిపారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఫైనల్ గా ఈ డిసిషన్ తీసుకొని అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సంక్రాంతికి మహేష్ , బన్నీ చెరో సినిమాతో భారీ వసూళ్లు సాదిస్తే వచ్చే  సంక్రాంతికి తారక్ , చరణ్ ఒకే సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.